e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 24, 2021
Home News ఆర్థిక సంక్షోభంలో దేశం.. భారీగా పెరిగిన క్రికెట‌ర్ల జీతాలు

ఆర్థిక సంక్షోభంలో దేశం.. భారీగా పెరిగిన క్రికెట‌ర్ల జీతాలు

ఇస్లామాబాద్‌: మన దాయాది దేశం పాకిస్థాన్ ఎంత‌టి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందో తెలుసు క‌దా. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు చైర్మ‌న్‌గా వ‌చ్చిన మాజీ కెప్టెన్ ర‌మీజ్ ర‌జా.. క్రికెట‌ర్ల జీతాల‌ను భారీగా పెంచేశారు. ఏకంగా 250 శాతం మేర వారి జీతాలు పెర‌గ‌డం విశేషం. అక్క‌డి గ్రూప్ డీ ప్లేయ‌ర్స్ ఇన్నాళ్లూ నెల‌కు 40 వేల పాకిస్థాన్ రూపాయ‌ల‌ను (మ‌న క‌రెన్సీలో రూ.17 వేలు) అందుకునే వారు. కానీ ఇప్పుడు వారి జీతాలు ల‌క్ష పెరిగి ల‌క్షా 40 వేల పాక్ రూపాయ‌ల‌కు చేరింది. ఈ పెంపు త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని ర‌జా చెప్పారు. 192 మంది దేశ‌వాళీ క్రికెటర్లు ఈ నిర్ణ‌యం కార‌ణంగా ల‌బ్ది పొందుతున్నారు.

ఇక నేష‌న‌ల్ టీమ్‌లోని గ్రేడ్ ఎ ప్లేయ‌ర్స్ జీతాలు రూ.13.75 ల‌క్ష‌ల నుంచి రూ.14.75 ల‌క్ష‌ల‌కు చేరింది. గ్రేడ్ బి ప్లేయ‌ర్స్ 9.37 ల‌క్ష‌ల‌కు బ‌దులుగా 10.37 ల‌క్ష‌లు, గ్రేడ్ సీ ప్లేయ‌ర్స్ 6.87 ల‌క్ష‌ల‌కు బ‌దులుగా 7.87 ల‌క్ష‌లు అందుకోనున్నారు. టీమ్‌లో స్థానం కోసం ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని, స్వేచ్ఛ‌గా ఆడాల‌ని కొత్త పీసీబీ చీఫ్ ర‌మీజ్ ర‌జా పిలుపునిచ్చారు. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌పైనా ర‌జా స్పందించారు. ఈ మ్యాచ్ కోసం పాక్ 100 శాతం సిద్ధంగా ఉండాల‌ని అన్నారు. ఇప్ప‌ట్లో రెండు దేశాల మ‌ధ్య ద్వైపాక్షిక సిరీస్ సాధ్యం కాద‌ని స్ప‌ష్టం చేశారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana