ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Sports - Feb 09, 2021 , 01:33:52

పాకిస్థాన్‌ క్లీన్‌స్వీప్‌

పాకిస్థాన్‌ క్లీన్‌స్వీప్‌

  • దక్షిణాఫ్రికాపై 2-0తో సిరీస్‌ కైవసం

రావల్పిండి: ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన పాకిస్థాన్‌ 18 ఏండ్ల తర్వాత దక్షిణాఫ్రికాపై టెస్టు సిరీస్‌ విజయం సాధించింది. సోమవారం ముగిసిన రెండో టెస్టులో 95 పరుగుల తేడాతో గెలిచిన పాక్‌.. 2-0తో సఫారీలను క్లీన్‌స్వీప్‌ చేసింది. పేసర్‌ హసన్‌ అలీ రెండో ఇన్నింగ్స్‌లోనూ ఐదు వికెట్లు పడగొట్టడంతో దక్షిణాఫ్రికా 274 పరుగులకు ఆలౌటైంది. మార్క్మ్‌ (108), బవుమా (61), డసెన్‌ (48) రాణించినా.. మిగిలినవాళ్లు విఫలమవడంతో సఫారీలకు ఓటమి తప్పలేదు. 370 పరుగుల లక్ష్యఛేదనలో ఒకదశలో 241/3తో పటిష్టంగా కనిపించిన దక్షిణాఫ్రికాను హసన్‌ అలీ (5/60), షాహీన్‌ అఫ్రిది (4/51) దెబ్బకొట్టారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 10 వికెట్లు పడగొట్టిన హసన్‌అలీకి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌', మహమ్మద్‌ రిజ్వాన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌' అవార్డులు దక్కాయి.

VIDEOS

logo