గురువారం 25 ఫిబ్రవరి 2021
Sports - Jan 30, 2021 , 00:47:01

పాకిస్థాన్‌ గెలుపు

పాకిస్థాన్‌ గెలుపు

కరాచీ: స్పిన్నర్లు సత్తాచాటడంతో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్‌ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 14 ఏండ్ల తర్వాత పాక్‌లో పర్యటిస్తున్న సఫారీ జట్టుకు మొదటి మ్యాచ్‌లోనే ఓటమి ఎదురైంది. అరంగేట్ర స్పిన్నర్‌ నౌమన్‌ అలీ (5/35), యాసిర్‌ షా (4/79) విజృంభించడంతో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు ఆలౌటైంది. శుక్రవారం నాలుగో రోజు ఆటలో 88 పరుగుల సునాయాస లక్ష్యాన్ని పాకిస్థాన్‌ మూడు వికెట్లు కోల్పోయి ఛేధించింది. అజహర్‌ అలీ (31 నాటౌట్‌), బాబర్‌ ఆజమ్‌ (30) రాణించారు. దక్షిణాఫ్రికాతో ఇప్పటి వరకు 27 టెస్టులు ఆడిన పాక్‌ జట్టుకు ఇది ఐదో విజయం మాత్రమే. 


VIDEOS

logo