ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Sports - Aug 04, 2020 , 18:02:45

ఇంగ్లాండ్‌తో తొలి టెస్టుకు పాక్‌ జట్టిదే

ఇంగ్లాండ్‌తో  తొలి టెస్టుకు పాక్‌ జట్టిదే

మాంచెస్టర్‌: ఆతిథ్య ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌ మధ్య   ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌  వేదికగా తొలి టెస్టు బుధవారం ఆరంభంకానుంది.  ఈ నేపథ్యంలో తొలి టెస్టు కోసం 16 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు మంగళవారం ప్రకటించింది.  మొదటి టెస్టులో  పాక్‌ ఇద్దరు స్పిన్నర్లతో బరిలో దిగే అవకాశం ఉన్నది. మరోవైపు వెస్టిండీస్‌తో టెస్ట్‌ సిరీస్‌లో విజయవంతమైన జట్టునే ఇంగ్లాండ్‌..పాక్‌తో  మొదటి టెస్టుకు కొనసాగిస్తున్నది.  జో రూట్‌ నేతృత్వంలోని ఇంగ్లీష్‌ జట్టు రెట్టించిన  ఉత్సాహంగా ఉన్నది. 

పాక్‌ జట్టు:

అజహర్‌ అలీ(కెప్టెన్‌), బాబర్‌ అజామ్‌(వైస్‌ కెప్టెన్‌), అబిద్‌ అలీ, అసాద్‌ షఫీఖ్‌, ఫవాద్‌ అలాం, ఇమామ్‌ హుల్‌ హక్‌, బట్టి, మహమ్మద్‌ అబ్బాస్‌, రిజ్వాన్‌, నీషమ్‌ షా, సర్ఫరాజ్‌ అహ్మద్‌, షాదాబ్‌ ఖాన్‌, షాహీన్‌ అఫ్రిదీ, షాన్‌ మసూద్‌, సొహైల్‌ ఖాన్‌, యాసిర్‌ షా


logo