శుక్రవారం 22 జనవరి 2021
Sports - Jan 04, 2021 , 00:02:05

పాకిస్థాన్‌ 297 ఆలౌట్‌

 పాకిస్థాన్‌ 297 ఆలౌట్‌

క్రైస్ట్‌చర్చ్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 297 పరుగులకు ఆలౌటైంది. సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ అజహర్‌ అలీ (93), స్టాండిన్‌ కెప్టెన్‌ మహమ్మద్‌ రిజ్వాన్‌ (61) అర్ధశతకాలతో ఆకట్టుకోగా.. ఫహీమ్‌ అష్రఫ్‌ (48), జాఫర్‌ గొహర్‌ (34) ఫర్వాలేదనిపించారు. తొలి టెస్టులో ఓడి సిరీస్‌లో వెనుకబడిన పాకిస్థాన్‌ను ఈ సారి కివీస్‌ పేసర్‌ కైల్‌ జెమీసన్‌ (5/69) దెబ్బకొట్టాడు. బౌన్స్‌కు సహకరిస్తున్న పిచ్‌పై ట్రెంట్‌ బౌల్ట్‌ (2/82), టిమ్‌ సౌథీ (2/61) అతడికి సహకారం అందించడంతో పాక్‌ జట్టు తొలి రోజు 83.5 ఓవర్లలోనే ఆలౌటైంది. కెరీర్‌లో ఆరో టెస్టు ఆడుతున్న కైల్‌ జెమీసన్‌ ఐదు వికెట్లు పడగొట్టడం ఇది మూడోసారి. గతంలో భారత్‌ (5/34), వెస్టిండీస్‌ (5/45)పై అతడు ఈ ఘనత నమోదు చేశాడు.


logo