మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Sports - Sep 03, 2020 , 00:59:50

పాక్‌కు ఓ గెలుపు

పాక్‌కు ఓ గెలుపు

మాంచెస్టర్‌: ఇంగ్లండ్‌ పర్యటనను పాకిస్థాన్‌ జట్టు విజయంతో ముగించింది. మంగళవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో పాక్‌ 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై గెలిచింది. దీంతో సిరీస్‌ 1-1తో సమమైంది. పాక్‌ నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లండ్‌..8 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. బెయిర్‌స్టో(0), మలన్‌(7), మోర్గాన్‌(10) విఫలం కాగా, మొయిన్‌ అలీ(61), బాంటన్‌(46) ఆకట్టుకున్నారు. అఫ్రిదీ, రియాజ్‌ రెండేసి వికెట్లతో రాణించారు. తొలుత హఫీజ్‌(86), హైదర్‌ అలీ(54) అర్ధసెంచరీలతో పాక్‌ 20 ఓవర్లలో 190/4 స్కోరు చేసింది. హఫీజ్‌, అలీ సమయోచిత ఇన్నింగ్స్‌తో జట్టుకు మెరుగైన స్కోరు కట్టబెట్టారు. జోర్డాన్‌కు రెండు వికెట్లు దక్కాయి. హఫీజ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'తో పాటు సిరీస్‌ లభించింది.  


logo