గురువారం 02 జూలై 2020
Sports - Jun 16, 2020 , 21:17:05

వెన‌క‌డుగేసిన హ‌ఫీజ్‌

వెన‌క‌డుగేసిన హ‌ఫీజ్‌

రిటైర్మెంట్‌పై మాట‌మార్చిన పాకిస్థాన్ ఆల్‌రౌండ‌ర్‌


ల‌హోర్‌:  టీ20  ప్ర‌పంచ‌క‌ప్ అనంత‌రం అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లుకుతాన‌ని ప్ర‌క‌టించిన పాకిస్థాన్ వెట‌ర‌న్ ఆల్‌రౌండ‌ర్ మ‌హ‌మ్మ‌ద్ హ‌ఫీజ్ మాట‌మార్చాడు. ఈ ఏడాది ఆసీస్ వేదిక‌గా జ‌ర‌గాల్సిన పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌పై నీల‌నీడ‌లు క‌మ్ముకున్న నేప‌థ్యంలో మెగాటోర్నీ వాయిదా ప‌డితే.. త‌న నిర్ణ‌యాన్ని కూడా వెన‌క్కి తీసుకుంటాన‌ని చెప్పుకొచ్చాడు. 

`17 ఏండ్లుగా పాకిస్థాన్ జ‌ట్టుకు ఆడుతున్నా.. పొట్టి ప్రపంచ‌క‌ప్ అనంత‌రం రిటైర్మెంట్ ప్ర‌క‌టించాల‌నుకున్నా. కానీ క‌రోనా వైర‌స్ కార‌ణంగా మెగాటోర్నీ షెడ్యూల్ ప్ర‌కారం జ‌రుగుతుందా అనే అనుమానంగా ఉంది. ఒక‌వేళ వ‌ర‌ల్డ్‌క‌ప్ వాయిదా ప‌డితే నా నిర్ణ‌యాన్ని కూడా  మార్చుకుంటా` అని హ‌ఫీజ్ చెప్పాడు. రెండేండ్ల క్రిత‌మే టెస్టు క్రికెట్‌కు టాటా చెప్పిన హ‌ఫీజ్ గ‌తేడాది వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లోనూ పాల్గొన్నాడు. ప్ర‌స్తుతం ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌కు ప్ర‌క‌టించిన జ‌ట్టులోనూ హ‌ఫీజ్‌కు చోటు ద‌క్కిన విష‌యం తెలిసిందే. 


logo