గురువారం 26 నవంబర్ 2020
Sports - Nov 02, 2020 , 01:29:47

జింబాబ్వేపై పాక్‌ విజయం

జింబాబ్వేపై పాక్‌ విజయం

రావల్పిండి: జింబాబ్వేతో జరుగుతున్న వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే పాకిస్థాన్‌ 2-0తో సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో వన్డేలో పాక్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే.. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' ఇఫ్తిఖార్‌ అహ్మద్‌ (5/40) ధాటికి 45.1 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. సీన్‌ విలియమ్స్‌ (75; 10 ఫోర్లు, ఒక సిక్సర్‌) ఒంటరి పోరాటం చేశాడు. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (77 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇమాముల్‌ హక్‌ (49) రాణించడంతో పాకిస్థాన్‌ 35.2 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 208 పరుగులు చేసింది. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే మంగళవారం ఇక్కడే జరుగనుంది.