మంగళవారం 31 మార్చి 2020
Sports - Feb 04, 2020 , 16:12:39

ఒక‌వైపే ప‌రుగెత్తిన ఇద్ద‌రు పాక్ బ్యాట్స్‌మెన్‌.. సూప‌ర్ రనౌట్‌

ఒక‌వైపే ప‌రుగెత్తిన ఇద్ద‌రు పాక్ బ్యాట్స్‌మెన్‌.. సూప‌ర్ రనౌట్‌

హైద‌రాబాద్‌:  ఇండోపాక్ మ్యాచ్ అంటేనే హై టెన్ష‌న్‌. ఇక అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్‌క‌ప్ సెమీస్‌లో పాక్ ప్లేయ‌ర్లు తీవ్ర వ‌త్తిడికి లోన‌వుతున్నారు. ఆ టెన్ష‌న్‌లోనే ఇద్ద‌రు బ్యాట్స్‌మెన్ ఒకేవైపు ప‌రుగు తీశారు. దీంతో ఒక‌రు ర‌నౌట‌య్యారు. ద‌క్షిణాఫ్రికాలోని పోచెఫ్‌స్ట్రూమ్ లో  జ‌రుగుతున్న వ‌న్డేలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది.  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్‌ను భార‌త బౌల‌ర్లు క‌ట్ట‌డి చేశారు. అయితే 31వ ఓవ‌ర్‌లో గ‌మ్మ‌త్తు ఘ‌ట‌న జ‌రిగింది.  స్పిన్న‌ర్ ర‌వి బిష్ణ్నాయ్ వేసిన ఓవ‌ర్‌లో.. ఇద్ద‌రు పాక్ బ్యాట్స్‌మెన్ అయోమ‌యంలో ఒకేవైపు ప‌రుగు తీశారు.  స్ట్ర‌యికింగ్ ఎండ్‌లో ఉన్న ఖాసిమ్ అక్ర‌మ్‌కు ర‌వి బౌల్ చేశాడు. డ్రాప్ షాట్ ఆడిన ఖాసిమ్ ప‌రుగు కోసం ప్ర‌య‌త్నించాడు.  ఇక నాన్ స్ట్ర‌యిక‌ర్ ఎండ్‌లో ఉన్న కెప్టెన్ న‌జీర్‌.. తొలుత ర‌న్ కోసం ముందుకు క‌దిలాడు. కానీ భార‌త ఫీల్డ‌ర్ అంకోలేక‌ర్ చురుకుగా బంతిని అందుకుని కీప‌ర్ జూర‌ల్‌కు అందించాడు.  

అయితే ఫీల్డ‌ర్ అంకోలేక‌ర్ వేగాన్ని గ‌మ‌నించిన పాక్ కెప్టెన్ న‌జీర్ మ‌ళ్లీ నాన్ స్ట్ర‌యిక‌ర్ వైపు వెన‌క్కి మ‌ళ్లాడు.  ఇక టెన్ష‌న్‌లో ప‌రుగు కోసం వ‌చ్చిన ఖాసిమ్ కూడా నాన్ స్ట్ర‌యిక‌ర్ వైపే ప‌రుగు తీశాడు.  ఇద్ద‌రూ ఒకేవైపు ర‌న్నింగ్ చేయ‌డం.. ఫీల్డ‌ర్ త‌న చేతిలో ఉన్న బంతిని కీప‌ర్ వైపు విస‌ర‌డం అంతా మెరుపు వేగంగా జ‌రిగిపోయాయి.  అయితే ముందుగా క్రీజ్‌లో బ్యాట్ పెట్టిన న‌జీర్ బ్ర‌తికిపోయాడు.  ప‌రుగు తీసిన ఖాసిమ్ మాత్రం దుర‌దృష్ట‌క‌ర‌రీతిలో ఔటయ్యాడు.  పాక్ ప్లేయ‌ర్లు మైదానంలోనే ఒక‌రిపై ఒక‌రు అస‌హ‌నం వ్య‌క్తం చేసుకున్నారు. గ‌తంలో సీనియ‌ర్ పాక్ క్రికెట్‌లోనూ ఇలాంటి ఘ‌ట‌న‌లే జ‌రిగేవి.  అయితే ఇప్ప‌డు అదే త‌ర‌హా క‌న్ఫ్యూజ‌న్‌.. అండ‌ర్ 19 పాక్ ప్లేయ‌ర్ల‌లోనూ క‌నిపించింది.   


logo
>>>>>>