మంగళవారం 24 నవంబర్ 2020
Sports - Nov 18, 2020 , 01:07:27

ఆసీస్‌ ఆటగాళ్ల తరలింపు

ఆసీస్‌ ఆటగాళ్ల తరలింపు

సిడ్నీ: భారత్‌, ఆసీస్‌ మధ్య తొలి టెస్టు జరుగాల్సిన అడిలైడ్‌లో కొత్తగా కరోనా కేసులు నమోదవుతుండడంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) చర్యలను ప్రారంభించింది. టెస్టు కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ సహా మరికొందరు ఆటగాళ్లను అడిలైడ్‌ నుంచి సిడ్నీకి విమానాల్లో తరలించింది. ఎట్టి పరిస్థితుల్లో ఇరు జట్ల మధ్య తొలి డే అండ్‌ నైట్‌ టెస్టును షెడ్యూల్‌ ప్రకారం డిసెంబర్‌ 17 నుంచే నిర్వహించే దిశగా అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నట్టు తెలిపింది. కరోనా ప్రభావం వల్ల వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా, క్వీన్స్‌ల్యాండ్‌, టాస్మానియా రాష్ర్టాల నుంచి దక్షిణ ఆస్ట్రేలియాకు ఎవరూ వెళ్లకుండా సరిహద్దులను కూడా మూసేసింది. ఈ నేపథ్యంలో పైన్‌, లబుషేన్‌ సహా టెస్టు ఆటగాళ్లను, సిబ్బందిని కరోనా ప్రభావం లేని సిడ్నీకి  చేర్చింది. ప్రస్తుతం టీమ్‌ఇండియా ఆటగాళ్లు సిడ్నీలో ప్రాక్టీస్‌తో కూడిన క్వారంటైన్‌లో ఉన్నారు. భారత్‌, ఆసీస్‌ మధ్య ఈ నెల 27న జరిగే తొలి వన్డేతో ఇరు జట్ల మధ్య సమరం మొదలుకానున్నది. మూడు వన్డేల సిరీస్‌ తర్వాత మూడు టీ20లు, నాలుగు టెస్టుల్లో ఇరు జట్లు తలపడనున్నాయి.