సోమవారం 30 నవంబర్ 2020
Sports - Oct 21, 2020 , 22:13:38

KKR vs RCB: ఒకే ఓవర్లో ఫించ్‌..పడిక్కల్‌ ఔట్‌

KKR vs RCB: ఒకే ఓవర్లో ఫించ్‌..పడిక్కల్‌ ఔట్‌

అబుదాబి: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నిర్దేశించిన 85 పరుగుల లక్ష్య ఛేదనలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఒకే ఓవర్లో ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. ఫెర్గుసన్‌ వేసిన ఏడో ఓవర్లో అరోన్‌ ఫించ్‌, దేవదత్‌ పడిక్కల్‌ పెవిలియన్‌ చేరారు.  రెండో బంతికి ఫించ్‌..వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌కు క్యాచ్‌ ఇచ్చి  ఔటయ్యాడు. నాలుగో బంతికి ఫామ్‌లో ఉన్న పడిక్కల్‌ అనూహ్యంగా రనౌటయ్యాడు.

బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుగా వచ్చిన  గుర్‌కీరత్‌ కారణంగా పడిక్కల్‌ రనౌట్‌ అయ్యాడు.ఈ దశలో క్రీజులోకి వచ్చిన విరాట్‌ కోహ్లీ నిలకడగా ఆడుతున్నాడు.  10 ఓవర్లకు బెంగళూరు 2 వికెట్లకు 63 పరుగులు చేసింది. కోహ్లీ(7), గుర్‌కీరత్‌(10) క్రీజులో ఉన్నారు.