శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Sports - Sep 11, 2020 , 15:34:05

లైన్‌ క్లియర్‌..నేటి నుంచే చాహర్‌ ప్రాక్టీస్‌: చెన్నై సీఈవో

లైన్‌ క్లియర్‌..నేటి నుంచే చాహర్‌ ప్రాక్టీస్‌: చెన్నై సీఈవో

దుబాయ్‌:  కరోనా బారిన పడ్డ చెన్నై సూపర్‌కింగ్స్‌(సీఎస్‌కే) ఫాస్ట్‌బౌలర్‌ దీపక్‌ చాహర్‌ నేటి నుంచి   మైదానంలో ప్రాక్టీస్‌ ప్రారంభిస్తాడని  ఆ  జట్టు సీఈవో  కాశీ  విశ్వనాథన్‌ మీడియాకు  తెలిపారు.   సీఎస్‌కే  వైపు నుంచి మాత్రమే కాకుండా బీసీసీఐ వైద్య బృందం నుంచి కూడా చాహర్‌కు క్లియరెన్స్‌ లభించిందని, మైదానంలో ప్రాక్టీస్‌ చేయడానికి అతడు సిద్ధంగా ఉన్నాడని విశ్వనాథన్‌ వెల్లడించారు.   వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకున్న  దీపక్‌  రెండోసారి నిర్వహించిన పరీక్షలోనూ నెగెటివ్‌ రావడంతో అతను జట్టుతో కలిశాడు. 

సీఎస్‌కే, బీసీసీఐ వైపు నుంచి దీపక్‌కు అవసరమైన అన్ని అనుమతులు ఉన్నాయని, ఈ రోజు నుంచి శిక్షణ ప్రారంభిస్తాడని ఆయన చెప్పారు.  మరో విదేశీ ప్లేయర్‌ డేవిడ్‌ మలన్‌(ఇంగ్లాండ్‌)ను జట్టులోకి తీసుకోవాలని సీఎస్‌కే యోచిస్తున్నదా అని అడిగిన ప్రశ్నకు అలాంటిదేమీ లేదని,అవన్నీ పుకార్లేనని   స్పష్టం చేశారు.

'ఇప్పటికే   మా జట్టులో   విదేశీ ఆటగాళ్ల కోటా ఫుల్‌గా ఉంది. కాబట్టి, జట్టులోకి మరో విదేశీయుడిని ఎలా తీసుకుంటామో నాకైతే తెలియదు.   మా జట్టులో ఏ విదేశీ ఆటగాడు గాయం బారినపడలేదని' వివరించారు. 


logo