సోమవారం 26 అక్టోబర్ 2020
Sports - Sep 20, 2020 , 01:22:43

కార్ల్‌సన్‌పై హరికృష్ణ గెలుపు

కార్ల్‌సన్‌పై హరికృష్ణ గెలుపు

చెన్నై: ప్రపంచ చెస్‌ చాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌(నార్వే)కు భారత గ్రాండ్‌మాస్టర్‌ పి.హరికృష్ణ షాకిచ్చాడు. సెయింట్‌ లూయిస్‌ ర్యాపిడ్‌ అండ్‌ బ్లిట్జ్‌ ఆన్‌లైన్‌ చెస్‌ టోర్నీ  బ్లిట్జ్‌-1 పోటీలో తెల్లపావులతో ఆడిన హరి 63 ఎత్తుల్లో కార్ల్‌సన్‌పై విజయం సాధించాడు. జెఫ్రీ షియాంగ్‌(అమెరికా)పైనా గెలిచిన అతడు ఆ తర్వాత నాలుగు మ్యాచ్‌ల్లో ఓడాడు. దీంతో 3.5పాయింట్లతో పట్టికలో ఆరో స్థానానికి పడిపోగా.. 18.5పాయింట్లతో కార్ల్‌సన్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ముగిసిన బోపన్న పోరాటం

రోమ్‌: ఇటాలియన్‌ ఏటీపీ టోర్నీలో భారత సీనియర్‌ ప్లేయర్‌ రోహన్‌ బోపన్న పోరాటం ముగిసింది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన పురుషుల డబుల్స్‌ క్వార్టర్స్‌ మ్యాచ్‌లో భారత్‌, కెనడా ద్వయం బోపన్న, డెనిస్‌ షపలోవ్‌ 6-4, 5-7, 7-10 తేడాతో ఫ్రాన్స్‌ జోడీ చార్డీ, మార్టిన్‌ చేతిలో ఓటమిపాలైంది. తొలి సెట్‌ను కైవసం చేసుకున బోపన్న, డెనిస్‌ జంట...అదే జోరును కొనసాగించడంలో విఫలమైంది. రెండో సెట్‌ను 5-7తో ప్రత్యర్థికి చేజార్చుకుని నిర్ణయాత్మక మూడో సెట్‌ను టైబ్రేకర్‌లో కోల్పోయింది. 


logo