సోమవారం 06 జూలై 2020
Sports - Apr 14, 2020 , 23:09:51

సొంత ఊరికి శానిటైజింగ్

సొంత ఊరికి శానిటైజింగ్

సొంత ఊరికి శానిటైజింగ్ 

ముంబై: క‌రోనా వైర‌స్‌పై పోరాడేందుకు క్రీడాకారులు ఒక్కో ర‌కంగా ముందుకొస్తున్నారు. కొంద‌రు ఆర్థిక స‌హాయం చేస్తుంటే..మ‌రికొంద‌రు పేద‌ల‌కు నిత్య‌వ‌స‌ర స‌రుకులు పంపిణీ చేస్తున్నారు. అయితే ఆసియా గేమ్స్ స్వ‌ర్ణ ప‌త‌క విజేత, రోయింగ్ క్రీడాకారుడు ద‌త్తుబాబ‌న్ బొక‌నాల్ మాత్రం త‌న సొంత ఊరికి మంచి చేసేందుకు ముందుకొచ్చాడు. 

మ‌హారాష్ట్ర చాంద్వాడ్ తాలుకాలోని తాలేగావ్ రుహి గ్రామంలో బొక‌నాల్ శానిటైజేష‌న్ చేశాడు. త‌న కుటుంబ‌స‌భ్యులు, స్నేహితుల‌తో క‌లిసి గ్రామంలోని  ద‌వాఖాన‌, పంచాయ‌తీ కార్యాల‌యం, వెట‌ర్న‌రీ ద‌వాఖాన‌ను క్రిమ సంహ‌రక మందుతో పిచీకారీ చేసిన‌ట్లు బొకనాల్ తెలిపాడు. వారంలో రెండు సార్లు ఇలా ఊరంతా శానిటైజ్ చేస్తామ‌ని ఈ సంద‌ర్భంగా వివ‌రించాడు. సెల‌వుల‌కు ఊరికి వ‌చ్చిన ఈ రోవ‌ర్ ..లాక్‌డౌన్ కార‌ణంగా ఇక్క‌డే చిక్కుకుపోయాడు. 


logo