సోమవారం 06 జూలై 2020
Sports - Jun 30, 2020 , 08:43:10

వచ్చే ఏడాది కూడా ఒలింపిక్స్‌ వద్దు!

వచ్చే ఏడాది కూడా ఒలింపిక్స్‌ వద్దు!

టోక్యో:  కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది జపాన్‌లో జరగాల్సిన టోక్యో  ఒలింపిక్స్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేసిన విషయం తెలిసిందే.   ఒలింపిక్స్‌ క్రీడా గ్రామంలో ఏర్పాట్ల కోసం ఇప్పటికే 12.6బిలియన్‌ డాలర్లను ఖర్చుచేసినట్లు నిర్వాహకులు తెలిపారు.  వచ్చే ఏడాది కూడా విశ్వ క్రీడలు  నిర్వహించొద్దంటూ టోక్యో వాసులు కోరుకుంటున్నారు.  రీ షెడ్యూల్‌ అయిన ఒలింపిక్స్‌పై రెండు జపాన్‌ వార్తా  సంస్థలు సర్వే నిర్వహించాయి.  అభిప్రాయ సేకరణలో ఎక్కువ మంది తమ నగరంలో పోటీలను వ్యతిరేకిస్తున్నారు.   

2021లోనూ  ఒలింపిక్స్‌ జరగొద్దని 51.7 శాతం మందికిపైగా టోక్యో వాసులు కోరుకుంటున్నట్టు ఆ సర్వేలో వెల్లడైంది.  46.3 శాతం మంది మాత్రం ఒలింపిక్స్‌ జరుగుతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు.   ఒలింపిక్స్‌ను వ్యతిరేకించిన వారిలో 27.7 శాతం  మంది రద్దు చేయాలని కోరుతున్నారు.   వీరిలో చాలా మంది ఈ పోటీలు రద్దైనా మంచిదేనని భావిస్తున్నారు.    24 శాతం మంది మరోసారి  వాయిదా వేయాలని కోరారు.   ఈ ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్‌  2021  జూలై 23కు వాయిదా  వేసిన  సంగతి తెలిసిందే. 


logo