బుధవారం 25 నవంబర్ 2020
Sports - Oct 10, 2020 , 10:18:28

ఫ్రెంచ్ ఓపెన్ ఫైన‌ల్లో జోకోవిచ్‌..

ఫ్రెంచ్  ఓపెన్ ఫైన‌ల్లో జోకోవిచ్‌..

హైద‌రాబాద్‌: టాప్ సీడ్ నోవాక్ జోకోవిచ్‌.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైన‌ల్లోకి ప్ర‌వేశించాడు.  శుక్ర‌వారం జ‌రిగిన సెమీఫైన‌ల్లో గ్రీస్‌కు చెందిన అయిదో సీడ్ స్టెఫానోస్ సిసిపాస్‌ను జోకో ఓడించాడు.  ర‌స‌వ‌త్త‌ర‌పోరులో జోకోవిచ్ 6-3, 6-2, 5-7, 4-6,6-1 స్కోర్‌తో స్టెఫానోస్‌పై విజ‌యం సాధించాడు.  రోలాండ్ గారోస్‌లో ఆదివారం జ‌రిగే ఫైన‌ల్ మ్యాచ్‌లో రాఫెల్ నాద‌ల్‌తో జోకోవిచ్ త‌ల‌ప‌డ‌నున్నాడు. స్టెఫానోస్‌తో మ్యాచ్‌లో మూడ‌వ సెట్‌లో మ్యాచ్ పాయింట్‌ను కోల్పోయిన సెర్బియా స్టార్ జోకోవిచ్ ఆ త‌ర్వాత తెగ క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింది.  మ‌రో సెమీస్‌లో డీగోపై నెగ్గిన నాద‌ల్ 13వ సారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌పై క‌న్నేశాడు.  

స‌మ‌ర‌మే..

జోకోవిచ్, నాదల్ త‌మ కెరీర్‌లో ఒక‌రిపై ఒక‌రు పోటీప‌డ‌డం ఇది 56వ సారి అవుతుంది.  గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ మ్యాచుల్లో ఇద్దరు పురుషులు ఇంత క‌న్నా ఎక్కువ సార్లు త‌ల‌ప‌డ‌లేదు.  వీరిద్ద‌రూ ఓ గ్రాండ్‌స్లామ్ ఫైన‌ల్లో పోటీప‌డ‌డం ఇది తొమ్మిద‌వ సారి అవుతుంది. గ్రాండ్ స్లామ్ టైటిళ్ల‌ను ఎక్కువ సంఖ్య‌లో ఎవ‌రు గెలుచుకున్నార‌న్న ఉత్కంఠ‌ను కూడా ఈ మ్యాచ్ కొంత తీర్చ‌నున్న‌ది. జోకోవిచ్‌, నాదల్‌, రోజ‌ర్ ఫెద‌ర‌ర్‌లు .. గ‌త కొన్నేళ్లుగా గ్రాండ్‌స్లామ్‌లో త‌మ మార్క్‌ను చూపించారు.  ఒక‌వేళ రేప‌టి ఫైన‌ల్లో నాద‌ల్ గెలిస్తే, అప్పుడు 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల‌తో అత‌ను ఫెద‌ర‌ర్‌తో స‌మానం అవుతాడు.  

ఒక‌వేళ జోకోవిచ్ రేప‌టి ఫైన‌ల్లో విక్ట‌రీ కొడితే, అప్పుడు అత‌ని ఖాతాలో గ్రాండ్‌స్లామ్‌ల సంఖ్య 18కి చేరుకున్న‌ది. అయితే శుక్ర‌వారం స్టెఫానోస్‌తో జ‌రిగిన మ్యాచ్ నాలుగు గంట‌ల పాటు సాగింద‌ని, అయినా తానేమీ డ‌ల్‌గా ఫీల‌వ్వ‌డం లేద‌ని జోకోవిచ్ తెలిపాడు.