గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Mar 05, 2020 , 00:17:26

థామస్‌ థండర్‌

థామస్‌ థండర్‌

పల్లెకెల: బ్యాటింగ్‌లో టాపార్డర్‌ దుమ్మురేపడంతో పాటు బౌలింగ్‌ ఒషానో థామస్‌ (5/28) విజృంభించడంతో శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో వెస్టిండీస్‌ విజయం సాధించింది. మొదట  విండీస్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 196 పరుగులు చేసింది. సిమన్స్‌ (67 నాటౌట్‌) అర్ధశతకం బాదగా.. బ్రండన్‌ కింగ్‌ (33), రస్సెల్‌ (35; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), పొలార్డ్‌ (34; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. అనంతరం లక్ష్యఛేదనలో లంక 19.1 ఓవర్లలో 171 రన్స్‌కు ఆలౌటైంది. కుషాల్‌ పెరేరా (66), హసరంగ (44) పోరాడినా ఫలితం లేకపోయింది.


పొలార్డ్‌ @ 500

విండీస్‌ కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌ పొట్టి ఫార్మాట్‌లో 500 మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ప్రపంచవ్యాప్తంగా అన్ని లీగ్‌ల్లో కలుపుకొని అతడు ఈ ఘనత సాధించాడు. 


logo
>>>>>>