మియామి: జపాన్ టెన్నిస్ స్టార్ నవోమి ఒసాకా వరుస విజయాలకు బ్రేక్ పడింది. ఓటమి ఎరుగకుండా 23 మ్యాచ్ల్లో అప్రతిహత విజయాలతో దూకుడు మీద కనిపించిన ఒసాకా.. మియామి ఓపెన్లో తన పోరాటాన్ని ముగించింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ పోరులో నవోమి 0-6, 4-6 తేడాతో 23వ సీడ్ మరియా సక్కారీ చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైంది. 2020 ఫిబ్రవరి తర్వాత ఒసాకాకు ఇది తొలి ఓటమి.