టోక్యో: కొన్నేండ్లుగా టెన్నిస్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్న జపాన్ అమ్మాయి నవోమీ ఒసాక సంపాదనలోనూ అదరగొట్టింది. ఏడాదిలో 55.2 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.401కోట్లు)ను ఆర్జించింది. దీంతో క్రీడా చరిత్రలో ఓ ఏడాది అత్యధిక సంపాదన సాధించిన మహిళా అథ్లెట్‌గా 23 ఏండ్ల ఒసాక రికార్డు సృష్టించింది. ఈ మొత్తంలో 5.2 మిలియన్ డాలర్లు ప్రైజ్‌మనీ ద్వారానే నవోమీ దక్కించుకుంది. మిగిలిన మొత్తం మ్యాచ్‌లు, ఎండార్స్మెంట్లు, స్పాన్సర్‌షిప్‌ల ద్వారా దక్కాయి. 2018 యూఎస్ ఓపెన్ ఫైనల్లో దిగ్గజం సెరెనా విలియమ్స్‌ను ఓడించి ఒసాక సంచలనం సృష్టించింది. ఆ తర్వాత రెండుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్, మరోసారి యూఎస్ ఓపెన్ గెలిచి సత్తాచాటింది. మరోవైపు వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ఒసాక చేసిన పోరాటాన్ని సైతం అందరూ ప్రశంసించారు.