గురువారం 01 అక్టోబర్ 2020
Sports - Aug 16, 2020 , 13:28:57

మహీ కోసం ఫేర్‌వెల్‌ మ్యాచ్‌ నిర్వహించండి: సీఎం సోరెన్‌

మహీ కోసం ఫేర్‌వెల్‌ మ్యాచ్‌ నిర్వహించండి: సీఎం సోరెన్‌

రాంచీ:   భారత క్రికెట్లో  అత్యంత విజయవంతమైన సారథి మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. :జూలై 7, 1981, రాంచీ(జార్ఖండ్)లో మహీ జన్మించాడు.   ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటించిన అనంతరం జార్ఖండ్‌ ముఖ్యమంత్రి  హేమంత్‌ సోరెన్‌ ట్విటర్లో స్పందించారు. మాహీ కోసం వీడ్కోలు మ్యాచ్ ఏర్పాటు చేస్తే జార్ఖండ్  ఆతిథ్యం ఇస్తుంద‌ని ఆయన పేర్కొన్నారు. 

ధోనీ కోసం ఫేర్‌వెల్‌ మ్యాచ్‌ నిర్వహించాలని సోరెన్‌  భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి విజ్ఞప్తి చేశారు. ధోనీ సొంత రాష్ట్రం జార్ఖండ్ కావడంతో వీడ్కోలు  మ్యాచ్‌ను రాంచీ వేదికగా నిర్వహించాలని    ఆ రాష్ట్ర సీఎం హేమంత్   కోరుతున్నారు. 

'దేశం, జార్ఖండ్ గర్వించదగ్గ ఆటగాడు ధోనీ, మనందరికీ ఎన్నో మరపురాని జ్ఞాపకాలు మిగిల్చాడు.  ఝార్ఖండ్‌ ముద్దుబిడ్డ ధోనీని ఇకపై నీలిరంగు  జెర్సీలో చూడలేం.  దేశ ప్రజల హృదయాలు ఇంకా నిండలేదు.రాంచీలో మా మహీకి వీడ్కోలు మ్యాచ్‌ చూడాలనుకుంటున్నాను. ఈ మ్యాచ్‌ను ప్రపంచం మొత్తం వీక్షిస్తుంది. మహీ కోసం ఝార్ఖండ్‌ ఆతిథ్యం ఇవ్వబోయే మ్యాచ్‌ను బీసీసీఐ నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు' ఆయన ట్వీట్‌ చేశారు. 


logo