ఆదివారం 24 జనవరి 2021
Sports - Dec 31, 2020 , 01:18:17

ఒలెక్ట్రాకు 150 ఎలక్ట్రిక్‌ బస్సుల ఆర్డర్‌

ఒలెక్ట్రాకు 150 ఎలక్ట్రిక్‌ బస్సుల ఆర్డర్‌

హైదరాబాద్‌: రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహనాలు, బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌ టెక్‌ మరో అతిపెద్ద ఆర్డర్‌ను చేజిక్కించుకున్నది.  పుణె మహానగర్‌ పరివాహన్‌ మహామండల్‌ లిమిటెడ్‌(పీఎంపీఎంఎల్‌) నుంచి 150 ఎలక్ట్రిక్‌ బస్సుల సరఫరా కు ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా ఒలెక్ట్రా గ్రీన్‌ టెక్‌ లిమిటెడ్‌ సీఈవో, సీఎఫ్‌వో శరత్‌ చంద్ర మాట్లాడుతూ.. పీఎంపీఎంఎల్‌ ఆర్డర్‌ దక్కినందుకు చాలా సంతోషంగా ఉన్నదని, ఇప్పటికే పుణెలో 150 బస్సులను ఏవీ ట్రాన్స్‌ నడుపుతున్నదని, ఇప్పుడు ఆ సంఖ్య 300కి చేరుకోనున్నదని చెప్పారు. ఈ ఏసీ బస్సుల్లో 33 మంది ప్రయాణికులు కూర్చోవడానికి వీలుంటుంది. బస్సుల్లో సీసీటీవీలు, అలాగే వికలాంగులు, వృద్ధులకు ఇబ్బంది లేకుండా వీల్‌ చెయిర్‌ ర్యాంప్‌, ఎమర్జెన్సీ బటన్‌, యూఎస్‌బీ సాకెట్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఒక్కసారి బ్యాటరీ చార్జింగ్‌తో దాదాపు 200 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చును. 


logo