మంగళవారం 14 జూలై 2020
Sports - May 10, 2020 , 17:06:54

ఆన్‌లైన్ క్లాస్‌ల‌తో ఆత్మ‌విశ్వాసం: బాబ‌ర్ ఆజ‌మ్

ఆన్‌లైన్ క్లాస్‌ల‌తో ఆత్మ‌విశ్వాసం:  బాబ‌ర్ ఆజ‌మ్

లాహోర్‌: ఆన్‌లైన్ కోచింగ్ కార‌ణంగా.. ఆత్మ‌విశ్వాసం పెరిగిందని పాకిస్థాన్ స్టార్ బ్యాట్స్‌మ‌న్ బాబ‌ర్ ఆజ‌మ్ పేర్కొన్నాడు. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా క్రీడాటోర్నీల‌న్నీ ర‌ద్దు కావ‌డంతో ఆట‌గాళ్లంతా ఇండ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఆట‌గాళ్లు ప్రాక్టీస్ చేసేందుకు అనుమ‌తి లేక‌పోవ‌డంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్లేయ‌ర్ల కోసం ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తున్నాడు. 

`ఆన్‌లైన్ క్లాసులు ఎంత‌గానో ఉప‌క‌రించాయి. వీటివ‌ల్ల నా  ఆత్మ‌విశ్వాసం రెట్టింపైంది. ఎప్ప‌టి నుంచో మ‌హ‌మ్మ‌ద్ యూసుఫ్‌, యూనిస్ ఖాన్ వంటి ఆట‌గాళ్ల నుంచి చిట్కాలు నేర్చుకోవాల‌నుకున్నా.. పీసీబీ ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ సెష‌న్‌లో అది సాధ్య‌ప‌డింది` అని బాబ‌ర్ ఆజ‌మ్ చెప్పుకొచ్చాడు. logo