ఆదివారం 05 జూలై 2020
Sports - Apr 12, 2020 , 19:38:14

ఆన్‌లైన్ చెస్‌తో 4.5 ల‌క్ష‌ల విరాళాల సేక‌ర‌ణ

ఆన్‌లైన్ చెస్‌తో 4.5 ల‌క్ష‌ల విరాళాల సేక‌ర‌ణ

ఆన్‌లైన్ చెస్‌తో 4.5 ల‌క్ష‌ల విరాళాల సేక‌ర‌ణ 

చెన్నై: క‌రోనా వైర‌స్‌పై పోరాడేందుకు దేశంలోని ప్ర‌ముఖ చెస్ ఆటగాళ్లంద‌రూ ఒక్క‌తాటి పైకి వ‌చ్చారు. త‌మ వంతు స‌హాయం చేసేందుకు గాను చెస్ దిగ్గ‌జం విశ్వ‌నాథ‌న్ ఆనంద్‌తో పాటు విదిత్ గుజ‌రాతి, హ‌రిక్రుష్ణ‌, అధిబ‌న్‌, హంపి, హారిక ముందుకు వ‌చ్చారు. వీరంతా క‌లిసి అభిమానుల‌తో ఆన్‌లైన్‌లో చెస్ ఆడ‌టం ద్వారా రూ. 4. 5 లక్ష‌ల విరాళాల‌ను సేక‌రించారు.

 చెస్‌.కామ్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ ఆన్‌లైన్ ఆట ద్వారా పీఎం కేర్స్‌కు నిధులు సేక‌రించ‌డం బాగుంద‌ని సంస్థ డైరెక్ట‌ర్ రాకేశ్ కుల‌క‌ర్ణి పేర్కొన్నారు. క‌రోనాతో ఏర్ప‌డిన లాక్‌డౌన్‌తో ప్ర‌స్తుతం జ‌ర్మ‌నీలో చిక్కుకుపోయిన ఆనంద్ స‌ల‌హా మేర‌కు ఈ టోర్నీని నిర్వ‌హించిన‌ట్లు రాకేశ్ తెలిపారు. ఒక మంచి ప‌ని కోసం ఇంటి ద‌గ్గ‌ర నుంచి ఇలా నిధులు సేక‌రించ‌డం బాగుంద‌ని తెలుగు గ్రాండ్‌మాస్ట‌ర్ హారిక అంది. ఒకేసారి 20 బోర్డుల‌పై ఆడ‌టం కొత్త‌గా ఉంద‌ని ఆమె చెప్పుకొచ్చింది. 


logo