బుధవారం 25 నవంబర్ 2020
Sports - Nov 02, 2020 , 18:10:50

వన్‌ప్లస్ 8టీ సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్

వన్‌ప్లస్ 8టీ సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్

ముంబై:  చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. వన్‌ప్లస్‌ 8టీ సైబర్‌పంక్‌ 2077 ఎడిషన్‌ను చైనాలో ఆవిష్కరించింది. సింగిల్‌ ర్యామ్‌, స్టోరేజ్‌ వేరియంట్‌లో ఫోన్‌ను లాంచ్‌ చేసింది. 

ఫోన్‌ వెనుక భాగంలో పెద్ద కెమెరా ఉంది. 12జీబీ+256జీబీ వేరియంట్‌  8టీ సైబర్‌పంక్‌ 2077 లిమిటెడ్‌ ఎడిషన్‌  ధర రూ.44,500గా నిర్ణయించారు. ప్రస్తుతం ఈ ఫోన్ల ప్రీ-ఆర్డర్‌ ఇప్పటికే ప్రారంభం కాగా నవంబర్‌ 11 నుంచి సేల్‌ మొదలవనుంది. భారత్‌తో పాటు మిగతా దేశాల్లో ఎప్పుడు రిలీజ్‌ చేస్తామనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. 

సైబర్‌పంక్‌ 2077 స్పెసిఫికేషన్లు:

డిస్‌ప్లే: 6.55 అంగుళాలు

ప్రాసెసర్‌: క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 865

ఫ్రంట్‌ కెమెరా: 16 మెగా పిక్సల్‌

రియర్‌ కెమెరా: 48+16+5+2 మెగా పిక్సల్‌

ర్యామ్‌: 12జీబీ

స్టోరేజ్‌:256జీబీ

బ్యాటరీ: 4500 ఎంఏహెచ్‌

ఓఎస్‌: ఆండ్రాయిడ్ 11