ఆదివారం 07 జూన్ 2020
Sports - Apr 01, 2020 , 22:52:19

జె-విలేజ్‌కు ఒలింపిక్స్ జ్యోతి

జె-విలేజ్‌కు ఒలింపిక్స్ జ్యోతి

టోక్యో: ప‌్ర‌తిష్ఠాత్మ‌క ఒలింపిక్ జ్యోతి పుకూషిమాలోని జె-విలేజ్ జాతీయ శ‌క్ష‌ణా కేంద్రానికి చేరుకుంది. అట్ట‌హాసంగా జ‌రుగాల్సిన ఈ కార్య‌క్ర‌మాన్ని అతికొద్దిమంది అతిథుల స‌మ‌క్షంలో నిర్వ‌హించారు. ఈ నెల 30 వ‌ర‌కు జ్యోతిని సంద‌ర్శ‌కుల ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచ‌నున్నారు. క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతుండ‌టంతో ప‌రిమిత సంఖ్య‌లోనే సంద‌ర్శ‌కుల‌ను అనుమ‌తించ‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు. గ‌త నెల 20న గ్రీస్ నుంచి ఒలింపిక్ టార్చ్ జ‌పాన్‌కు వ‌చ్చింది. గ‌త గురువారం నుంచే రిలే జ‌రుగాల్సి ఉన్నా.. కొవిడ్‌-19 కార‌ణంగా టోక్యో ఒలింపిక్స్ ఏడాది వాయిదా ప‌డ‌టంతో జ్యోతి రిలేను నిలిపివేశారు. 

ప్ర‌స్తుతం జ్యోతి చేరుకున్న పుకూషిమా న‌గ‌రం 2011లో భారీ భుకంపం, సునామీల‌తో పాటు మూడు న్యూక్లియ‌ర్ రియాక్ట‌ర్ల పేలుడుకు తీవ్రంగా ధ్వంస‌మైంది. ఇంత భారీ న‌ష్టం వాటిల్లినప్ప‌టికీ తిరిగి కోలుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న పుకూషిమా తెగువ‌కు గుర్తింపుగా టార్చ్ రిలేను ఈ రీజియ‌న్ నుంచి ప్రారంభించ‌నున్నారు.


logo