శనివారం 28 మార్చి 2020
Sports - Feb 16, 2020 , 00:09:35

భావనకు ఒలింపిక్స్‌ బెర్త్‌

భావనకు ఒలింపిక్స్‌ బెర్త్‌
  • 20కిలోమీటర్ల రేస్‌వాక్‌లో టోక్యో విశ్వక్రీడలకు అర్హత
  • జాతీయ చాంపియన్‌షిప్‌లో ‘రికార్డు’ స్వర్ణం

రాంచీ: 20 కిలోమీటర్ల రేస్‌ వాకర్‌ భావన జాట్‌ చరిత్ర సృష్టించింది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆమె టోక్యో ఒలింపిక్స్‌లో బెర్త్‌ దక్కించుకుంది. జాతీయ రికార్డును సైతం బద్దలు కొట్టి.. విశ్వక్రీడలకు ఈ విభాగంలో అర్హత సాధించిన రెండో భారతీయ మహి ళా అథ్లెట్‌గా నిలిచింది. ఆదివారం ఇక్కడ జరిగిన జాతీయ చాంపియన్‌షిప్‌ 20కిలోమీటర్ల రేస్‌వాక్‌లో భావన జాట్‌ గంటా 29నిమిషాల 54సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకొని ఒలింపిక్స్‌ అర్హత సమయాన్ని(1:31:00) సునాయాసంగా అందుకుంది. జాతీయ రికార్డును నెలకొల్పడంతో పాటు స్వర్ణ పతకంతో మెరిసింది. గతేడాది అక్టోబర్‌లో జరిగిన జాతీయ ఓపెన్‌ చాంపియన్‌షిప్‌లో (1:38.30)లో నమోదు చేసిన ప్రదర్శన కంటే.. ఎనిమిది నిమిషాలను భావన మెరుగుపరుచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రియాం క గోస్వామి (1:31.36) కాస్తలో ఒలింపిక్స్‌ బెర్త్‌ను మిస్‌ చేసుకొని, రజతంతో సరిపెట్టుకుంది. పురుషుల విభాగంలో సందీప్‌ కుమార్‌ స్వర్ణం సాధించినా.. ఒలింపిక్స్‌ మార్క్‌ను అందుకోలేకపోయాడు.


logo