గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Mar 23, 2020 , 09:28:52

ఒలింపిక్స్ నిర్వ‌హిస్తారా ?.. వ‌త్తిడిలో జ‌పాన్‌

ఒలింపిక్స్ నిర్వ‌హిస్తారా ?.. వ‌త్తిడిలో జ‌పాన్‌

హైద‌రాబాద్‌:  ఈ ఏడాది జూలైలో జ‌ర‌గాల్సిన ఒలింపిక్స్ క్రీడ‌ల‌పై నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి.  క‌రోనా వైర‌స్ వ్యాప్తితో ప్ర‌పంచ దేశాలు త‌మ అథ్లెట్ల‌ను పంపేందుకు వెనుకాడుతున్నాయి. జ‌పాన్‌లో జ‌ర‌గ‌నున్న ఆ మ‌హాక్రీడ‌ల‌కు క‌రోనా విఘాతం అనివార్యంగా తోస్తున్న‌ది.  జ‌పాన్ ప్ర‌ధాని షింజో అబే కూడా ఇదే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్న‌ట్లు తెలిసింది. ఆస్ట్రేలియా మాత్రం త‌మ క్రీడాకారుల‌ను ఒలింపిక్స్‌కు స‌న్న‌ద్దం చేస్తున్న‌ది.  కెన‌డా త‌మ అథ్లెట్ల‌ను ఒలింపిక్స్‌కు పంపేది లేద‌ని తీర్మానించింది. 

షింజో అబే ఇవాళ పార్ల‌మెంట్‌లో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఒలింపిక్స్ నిర్వ‌హ‌ణ‌పై అనుమానాలు వ్య‌క్తం చేశారు. కోవిడ్‌19 మ‌హ‌మ్మారి వ‌ల్ల క్రీడ‌ల నిర్వ‌హ‌ణ వీలుకాకుంటే, వాటిని వాయిదా వేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. జూలై 24వ తేదీన మ‌హావేడుక ప్రారంభం కావాల్సి ఉన్న‌ది.  ఇంట‌ర్నేష‌న‌ల్ ఒలింపిక్ క‌మిటీ క్రీడ‌ల నిర్వ‌హ‌ణ‌పై సుదీర్ఘంగా చ‌ర్చించింది. అయితే మ‌రో నెల రోజుల త‌ర్వాత‌నే తుది నిర్ణ‌యం తీసుకునే ఛాన్సు ఉంద‌ని ఐఓసీ పేర్కొన్న‌ది.  ఏడాది కాలంపాటు వాయిదా వేస్తే త‌ప్ప త‌మ క్రీడాకారుల‌ను పంప‌లేమ‌ని కెన‌డా తేల్చి చెప్పింది. ఇక ఇత‌ర దేశాల ఒలింపిక్ క‌మిటీలు త‌మ నిర్ణ‌యాలు వెల్ల‌డించాల్సి ఉన్న‌ది. 

ఒక‌వేళ ఒలింపిక్స్ వాయిదా ప‌డితే, అది జపాన్‌కు భారీ న‌ష్టాన్ని మిగిల్చే అవ‌కాశాలు ఉన్నాయి. ఒక‌వేళ ర‌ద్దు అయితే, అప్పుడు ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉంటుంద‌ని అంటున్నారు.  ఒలింపిక్స్ నిర్వ‌హ‌ణ కోసం ఇప్ప‌టికే జ‌పాన్ సుమారు 30 బిలియ‌న్ల డాల‌ర్ల‌ను ఖ‌ర్చు చేసింది. అందుకే జ‌పాన్ ప్ర‌ధాని షింజో అబే.. ఎట్టి ప‌రిస్థితుల్లో పూర్తి స్థాయి క్రీడ‌ల‌ను నిర్వ‌హించాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. కానీ క‌రోనా త‌గ్గితేనే ఆ గేమ్స్‌కు అవకాశం ఉంటుంది. logo
>>>>>>