మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Sports - Jul 30, 2020 , 12:17:26

‘పరిమిత ప్రేక్షకుల మధ్య టోక్యో ఒలింపిక్స్​’

‘పరిమిత ప్రేక్షకుల మధ్య టోక్యో ఒలింపిక్స్​’

‘టోక్యో: పరిమిత సంఖ్యలో హాజరయ్యే ప్రేక్షకుల మధ్య వచ్చే ఏడాదికి వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్ ​ జరుగొచ్చని నిర్వాహక కమిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్​ తషిరో ముటో అభిప్రాయపడ్డారు. విశ్వక్రీడలను వాయిదా లేదా రద్దు చేయాలన్న చర్చలేవీ ప్రస్తుతం జరుగడం లేదని బీబీసీకి గురువారం ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. కాగా ఈ ఏడాది జరుగాల్సిన టోక్యో ఒలింపిక్స్ కరోనా వైరస్ కారణంగా వచ్చే సంవత్సరానికి వాయిదా పడ్డాయి. 2021 జూలై 23న ప్రారంభం కావాల్సి ఉంది. కరోనా తీవ్రత కొనసాగుతుండడంతో వచ్చే ఏడాది కూడా విశ్వక్రీడల నిర్వహణ కష్టమేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ముటో స్పందించాడు.

“వచ్చే ఏడాది ఒలింపిక్స్ జరుగడంపైనే అందరి దృష్టి ఉంది. మేం కూడా విశ్వక్రీడలను నిర్వహించేందుకు కృషి చేస్తున్నాం. భౌతిక దూరం పాటించేలా పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించాలని థామస్ బాచ్​(ఐఓసీ చీఫ్​) కూడా ఆలోచిస్తున్నారు. మేం కూడా అందుకే ప్రణాళిక రచిస్తున్నాం. ప్రజలు సురక్షితంగా ఫీలయ్యే వాతావరణాన్ని మేం కల్పిస్తాం. జపాన్​కు వచ్చే ముందు అథ్లెట్లు, ఐవోసీలోని అందరూ కరోనా పరీక్షలు జరిపించుకోవాల్సి రావొచ్చు. దాంతో పాటు పటిష్ఠమైన వైద్య వ్యవస్థ అవసరం అవుతుంది. అలాగే వసతి, రవాణా ప్రణాళికలను పక్కాగా చేసుకోవాల్సి ఉంటుంది. అప్పటి లోగా అన్ని ఆంక్షలు తొలగిపోతాయనుకోవడం తొందరపాటే అవుతుంది. అందుకే ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించాలి. వ్యాక్సిన్ వస్తే బాగుంటుంది” అని తషిరో ముటో అన్నారు.   


logo