సోమవారం 08 మార్చి 2021
Sports - Jan 30, 2021 , 00:47:01

మార్చిలో ఫెడ్‌కప్‌

మార్చిలో ఫెడ్‌కప్‌

పాటియాలా: ఫెడ్‌కప్‌ జాతీయ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ను మార్చి 15 నుంచి 19 వరకు నిర్వహించాలని భారత అథ్లెటిక్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) నిర్ణయించింది. టోక్యో ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌ అయిన ఫెడ్‌కప్‌ను కొవిడ్‌-19 మార్గదర్శకాలకు లోబడి నిర్వహిస్తామని ఏఎఫ్‌ఐ శుక్రవారం వెల్లడించింది. ‘కరోనా మహమ్మారి కాలంలో ఎస్‌వోపీని పకడ్బందీగా పాటిస్తూ పోటీలు నిర్వహిస్తాం. నిబంధనలను ఉల్లంఘించిన వారిని పోటీల నుంచి బహిష్కరిస్తాం’ అని ఏఎఫ్‌ఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఎంట్రీలు పంపిన తర్వాత ఈవెంట్‌లో పాల్గొనని అథ్లెట్లను భవిష్యత్తులో జరుగనున్న పోటీలకు కూడా అనుమతించబోమని అందులో పేర్కొంది. పాటియాలాలోని స్పోర్ట్స్‌ సెంటర్‌లో ఫెడ్‌కప్‌ 24వ ఎడిషన్‌ పోటీలు నిర్వహించనున్నారు. 


VIDEOS

logo