మంగళవారం 31 మార్చి 2020
Sports - Jan 25, 2020 , 00:01:31

హైదరాబాద్‌లోనే ఒలింపిక్‌ సంఘం ఎన్నికలు!

హైదరాబాద్‌లోనే ఒలింపిక్‌ సంఘం ఎన్నికలు!

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: హైదరాబాద్‌లో తెలంగాణ ఒలింపిక్‌ సంఘం(టీవోఏ) ఎన్నికల నిర్వహణకు అడుగులు పడుతున్నాయి. ఢిల్లీలో కాకుండా హైదరాబాద్‌లోనే ఎన్నికలు నిర్వహించాలంటూ రాష్ట్ర హ్యాండ్‌బాల్‌, టీటీ అసోసియేషన్లు దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం సానుకూలంగా స్పందించింది. ఇటీవల జరిగిన టీవోఏ సర్వసభ్య సమావేశంలో వచ్చే నెల 9న ఢిల్లీలో ఎన్నికలు జరుగాలన్న నిర్ణయాన్ని హ్యాండ్‌బాల్‌, టీటీ అసోసియేషన్లు సవాలు చేశాయి. దీనిపై వాదనలు విన్న హైకోర్టు పిటీషనర్‌ విన్నపాన్ని సమర్థిస్తూ ఈనెల 30న తుదితీర్పును వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. టీవోఏ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం మొదలైనా ఇప్పటి వరకు ఒక్క నామినేషన్‌ దాఖలు కాలేదు.


logo
>>>>>>