బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Jan 12, 2020 , 01:42:35

ఒడిశా హ్యాట్రిక్‌

ఒడిశా హ్యాట్రిక్‌

భువనేశ్వర్‌: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌(ఐఎస్‌ఎల్‌) ఆరో సీజన్‌లో ఒడిశా ఎఫ్‌సీ సొంతగడ్డపై వరుసగా మూడో విజయం సాధించింది. శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఒడిశా 2-0తో ముంబై సిటీ ఎఫ్‌సీపై గెలిచింది. ఆతిథ్య జట్టు తరఫున రెండో అర్ధభాగంలో అరిడానే శాంతన (48వ నిమిషంలో), క్సికో హెర్నాండెజ్‌ (74వ ని.లో) గోల్స్‌ చేశారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఒడిశా నాలుగో స్థానానికి దూసుకొచ్చింది.


logo
>>>>>>