గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Feb 08, 2020 , 09:48:15

కివీస్‌కు షాక్‌..గప్తిల్‌ రనౌట్‌

కివీస్‌కు షాక్‌..గప్తిల్‌ రనౌట్‌

భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది.

ఆక్లాండ్‌: భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. స్వల్ప వ్యవధిలోనే రెండు కీలక వికెట్లు చేజార్చుకుంది.  జడేజా వేసిన 30వ ఓవర్లో మార్టిన్‌ గప్తిల్‌(79) రనౌటయ్యాడు. ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి గప్తిల్‌ భారత బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నాడు. దూకుడుగా ఆడుతున్న గప్తిల్‌ను ఔట్‌ చేయడంతో కివీస్‌ను కొంతమేర కట్టడి చేసినట్లైంది.  అంతకుముందు శార్దుల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో టామ్‌ బ్లండెల్‌ ఔటయ్యాడు. 27వ ఓవర్‌ రెండో బంతిని ఫోర్‌ బాదిన బ్లండెల్‌(22) తర్వాతి బాల్‌ను కూడా భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో మిడాన్‌లో నవదీప్‌ సైని చేతికి చిక్కాడు.  ఆరంభం నుంచి  గప్తిల్‌ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుండి నడిపించాడు.   సూపర్‌ ఫామ్‌లో ఉన్న వెటరన్‌ ప్లేయర్‌ రాస్‌ టేలర్‌ క్రీజులోకి వచ్చాడు.   బౌండరీ విస్తీర్ణం తక్కువగా ఉండటంతో బ్యాట్స్‌మెన్‌ అలవోకగా బౌండరీలు బాదేస్తున్నారు.   31 ఓవర్లు ముగిసేసరికి కివీస్‌ మూడు వికెట్లకు 163 పరుగులు చేసింది. లాథమ్‌(4), రాస్‌ టేలర్‌(12) క్రీజులో ఉన్నారు. logo