ఆదివారం 05 జూలై 2020
Sports - May 15, 2020 , 00:22:33

'ఖేల్‌రత్న'కు మౌద్గిల్‌ నామినేట్‌

 'ఖేల్‌రత్న'కు మౌద్గిల్‌ నామినేట్‌

న్యూఢిల్లీ: అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్‌రత్న కోసం షూటర్‌ అంజుమ్‌ మౌద్గిల్‌ పేరును భారత జాతీ య రైఫిల్‌ సంఘం(ఎన్‌ఆర్‌ఏఐ) ప్రతిపాదించింది. అలా గే ద్రోణాచార్య అవార్డు కోసం జస్పాల్‌ రానా పేరును వరుసగా రెండో ఏడాది క్రీడామంత్రిత్వ శాఖకు పంపడంతో పాటు అర్జున పురస్కారం కోసం పిస్టల్‌ షూటర్లు సౌరభ్‌ చౌదరి, అభిషేక్‌ వర్మ, మను బాకర్‌, ఎలావెనిల్‌ వలరివాన్‌ పేర్లను నామినేట్‌ చేసినట్టు ఎన్‌ఆర్‌ఏఐ గురువారం వెల్లడించింది. అంజుమ్‌ మౌద్గిల్‌ గతే డాది షూటింగ్‌ ప్రపంచకప్‌ 10మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు సైతం అర్హత సాధించింది. logo