బుధవారం 15 జూలై 2020
Sports - May 22, 2020 , 20:43:47

విదేశీ లీగ్‌ల్లో ఆడ‌నివ్వండి: ఉత‌ప్ప‌

విదేశీ లీగ్‌ల్లో ఆడ‌నివ్వండి: ఉత‌ప్ప‌

న్యూఢిల్లీ:  విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకు అనుమ‌తి కావాల్సిందిగా అడుగుతున్న ఆట‌గాళ్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఈ అంశంపై గ‌తంలో సురేశ్ రైనా, ఇర్ఫాన్ ప‌ఠాన్ త‌మ ఆస‌క్తి వెల్ల‌డిస్తే.. తాజాగా ఆ జాబితాలో వెట‌ర‌న్ బ్యాట్స్‌మ‌న్ రాబిన్ ఉత‌ప్ప చేరాడు. భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) సీనియ‌ర్ ఆట‌గాళ్ల‌కు ఈ అవ‌కాశం క‌ల్పిస్తేనే మంచిద‌ని ఉత‌ప్ప పేర్కొన్నాడు. అయితే ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) త‌ప్ప ఇత‌ర దేశాల లీగ్‌లు ఆడేందుకు బీసీసీఐ నిరాక‌రిస్తూ వ‌స్తున‌న విష‌యం తెలిసిందే. 

`విదేశీ టీ20 లీగ్‌లు ఆడేందుకు అవ‌కాశం ఇవ్వాలి. ద‌య‌చేసి మ‌మ్మ‌ల్ని వెళ్ల‌నివ్వండి. లీగ్‌లు ఆడ‌లేక‌పోతున్నందుకు చాలా బాధ‌ప‌డుతున్నా. క‌నీసం ఒక‌టీ లేదా రెండు లీగ్స్‌లో నైనా ఆడేలా నిబంధ‌న‌లు స‌డ‌లించాలి. ఆట‌గాడిగా ఎప్ప‌టిక‌ప్పుడు మెరుగ‌వ్వాలంటే మ్యాచ్‌లు ఆడాలి. అప్పుడే క్రికెట‌ర్‌గా ఏదైనా నేర్చుకోవ‌డ‌నాకి ల‌భిస్తుంది. బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ ఈ అంశంపై దృష్టి పెట్టాలి. భార‌త జ‌ట్టును మ‌రో స్థాయికి తీసుకెళ్లా స‌త్తా అత‌డికి ఉంది` అని ఉత‌ప్ప అన్నాడు. logo