ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Sports - Sep 16, 2020 , 07:45:17

కొవిడ్‌ నెగెటివ్ అయితేనే.. ‘సాయ్‌’లోకి ఎంట్రీ

కొవిడ్‌ నెగెటివ్ అయితేనే.. ‘సాయ్‌’లోకి ఎంట్రీ

చెన్నై : కొవిడ్‌ నెగెటివ్‌ సర్టిఫికెట్‌ ఉంటేనే జాతీయ శిబిరాల్లో చేరే ఎలైట్‌ అథ్లెట్లు, కోచ్‌లు, సహాయ సిబ్బందికి అనుమతి ఇవ్వనున్నట్లు సాయ్‌ తెలిపింది. స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా జారీ చేసిన మార్గదర్శకాల మేరకు కేంద్రాల్లో చేరే వారు 96 గంటల ముందు ఆర్‌టీ- పీసీఆర్‌ కొవిడ్‌-19 నెగెటివ్‌ సర్టిఫికెట్ ఇవ్వడం తప్పనిసరి చేశారు. ఇంతకు ముందు జాతీయ శిబిరాల్లో చేరిన పలువురు అథ్లెట్లు సాయ్‌ కేంద్రాల్లో చేరిన అనంతరం వైరస్‌ పాజిటివ్‌ పరీక్షించారు. ఈ నెల 1న సోనేపట్‌లో పాటియాలా బాక్సర్లు, వెయిట్‌ లిఫ్టర్లు, ట్రాక్ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెట్ల కోసం జాతీయ శిబిరాలను ప్రారంభించారు. బెంగళూరులోని సాయ్‌ కేంద్రంలో పురుషుల, మహిళల హాకీ జట్లు ఉన్నాయి. క్రీడాకారులు, కోచ్‌లు, సహాయ సిబ్బందికి కరోనా పరీక్షల కోసం ఖర్చును సాయ్‌ చెల్లింస్తుందని ప్రకటనలో పేర్కొంది. శిబిరాలకు హాజరువుతున్న వారు వారం రోజులు క్వారంటైన్‌లో ఉండాలని, అంతకు ముందు 15 రోజులు సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉండాలని సూచించింది. క్వారంటైన్‌ అనంతరం టెస్టులు చేసిన అనంతరం స్పోర్ట్స్‌ కార్యక్రమాల్లోకి అనుమతి ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా సాయ్‌ జారీ చేసిన ఎస్‌ఓపీలు కొనసాగింపుగా ఉంటాయని, శిక్షణా శిబిరాల్లో చేరిన కొత్త ట్రైనీలకు సంబంధించి విధానపరమైన మార్పులు చేయనున్నట్లు స్పష్టం చేసింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo