శనివారం 11 జూలై 2020
Sports - Jun 27, 2020 , 08:55:21

జకోవిచ్‌ కోచ్‌ గొరాన్‌కు కరోనా పాజిటివ్‌

జకోవిచ్‌ కోచ్‌ గొరాన్‌కు కరోనా పాజిటివ్‌

జాగ్రెబ్‌:  వింబుల్డన్‌ మాజీ ఛాంపియన్‌, వరల్డ్‌ నంబర్‌వన్‌ నొవాక్‌ జకోవిచ్‌ కోచ్‌ గొరాన్‌ ఇవాన్‌సెవిచ్‌(క్రొయేషియా) కరోనా బారినపడ్డాడు. ఇటీవల జరిగిన ఎగ్జిబిషన్‌ సిరీస్‌కు వెళ్లిన గొరాన్‌కు కరోనా పరీక్ష చేయగా పాజిటివ్‌గా తేలింది.  గత 10 రోజుల్లో రెండుసార్లు తనకు కోవిడ్‌-19 నెగెటివ్‌ వచ్చిందని, తాజాగా నిర్వహించిన పరీక్షలో మాత్రం పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని  ఇవాన్‌సెవిచ్ వెల్లడించాడు. 

2001లో గొరాన్‌ వింబుల్డన్‌ టైటిల్‌ విజేతగా నిలిచాడు. జకోవిచ్‌ ఇటీవల నిర్వహించిన ఆండ్రియా టూర్‌లో పాల్గొన్న జకోవిచ్‌తో పాటు దిమిత్రోవ్‌ (బల్గేరియా), బోర్నా కోరిచ్‌ (క్రొయేషియా), విక్టొర్‌ ట్రయోకీ(సెర్బియా)లకు కరోనా సోకిన విషయం తెలిసిందే. 


logo