మంగళవారం 31 మార్చి 2020
Sports - Feb 04, 2020 , 03:57:27

టాప్‌ లేపిన జొకో

టాప్‌ లేపిన జొకో
  • ఏటీపీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరిన నొవాక్‌

పారిస్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గిన నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా) ఏటీపీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరాడు. ఆదివారం మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన ఫైనల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన జొకో 6-4, 4-6, 2-6, 6-3, 6-4తో డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా)ను ఓడించి ఎనిమిదోసారి ట్రోఫీ చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. కెరీర్‌లో 17వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ నెగ్గిన జొకో.. నాదల్‌ (స్పెయిన్‌)ను రెండో స్థానానికి నెట్టి టాప్‌ ప్లేస్‌కు దూసుకెళ్లాడు. రోజర్‌ ఫెదరర్‌ (స్విట్జర్లాండ్‌) మూడో స్థానంలోనే స్థిరంగా ఉండగా.. ఆదివారం ఫైనల్లో తృటిలో ఓడిన డొమినిక్‌ థీమ్‌ నాలుగో స్థానంలో నిలిచాడు. మహిళల విభాగంలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ కిరీటం నెగ్గిన సోఫియా కెనిన్‌ (అమెరికా) కెరీర్‌ బెస్ట్‌ 7వ ర్యాంక్‌కు దూసుకెళ్లింది. ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా) అగ్రస్థానంలో ఉండగా.. సిమోన హలెప్‌ (రొమేనియా), ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌), స్వితోలినా (ఉక్రెయిన్‌), బెలిండా (స్విట్జర్లాండ్‌) వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.
logo
>>>>>>