యూఎస్ ఓపెన్ సెమీస్‌లో జొకో
న్యూయార్క్: సీజన్ ముగింపు గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) జోరు కొనసాగుతున్నది. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన జొకో.. తొలి క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్ తన పేరిట రాసుకునేందుకు రెండడుగుల దూరంలో ఉన్నాడు. బుధవారం పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్‌సీడ్ జొకోవిచ్ 5-7, 6-2, 6-2, 6-3తో ఆరో సీడ్ బెరెట్టిని (ఇటలీ)పై విజయం సాధించి సెమీస్‌కు చేరాడు. 3 గంటలా 27 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి సెట్ కోల్పోయిన జొకో.. ఆ తర్వాత ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగాడు. 12 ఏస్‌లు సంధించిన నొవాక్.. 5 బ్రేక్ పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 7-6 (8/6), 6-3, 6-4తో హారిస్ (దక్షిణాఫ్రికా)పై విజయంతో సెమీస్‌లో అడుగుపెట్టాడు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో మరియా సక్కరి (గ్రీస్) 6-4, 6-4తో కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది.