వాషింగ్టన్: ప్రతిష్ఠాత్మక యూఎస్ ఓపెన్‌లో ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ జోరు కొనసాగుతున్నది. శనివారం జరిగిన మ్యాచ్‌లో విజయంతో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. జర్మనీ ప్లేయర్, నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో హోరాహోరీగా సాగిన సెమీస్‌లో 4-6, 6-2, 6-4, 4-6, 6-2తో గెలుపొందాడు. దీంతో ఆదివారం జరగనున్న ఫైనల్లో రెండో సీడ్ డానిల్ మెద్వెదెవ్ (జర్మనీ)తో పోటీ పడనున్నాడు.
కాగా, ఈ మ్యాచ్‌లో గెలిచినట్లయితే అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలుపొందిన ఆటగాడిగా జకోవిచ్ చరిత్ర సృష్టించనున్నాడు. దీంతో 52 ఏళ్ల తర్వాత పురుషుల సింగిల్స్ క్యాలెండర్ ఇయర్ గ్రాండ్ స్లామ్ గెలిచిన ఆటగాడిగా రికార్డుల్లో నిలుస్తాడు. గతంలో 1969లో రాడ్ లావెర్ క్యాలెండర్ ఇయర్ గ్రాండ్ స్లామ్ గెలిచారు.