సోమవారం 01 మార్చి 2021
Sports - Feb 21, 2021 , 16:29:05

ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ చాంపియ‌న్ నొవాక్ జొకోవిచ్‌

ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ చాంపియ‌న్ నొవాక్ జొకోవిచ్‌

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ చాంపియ‌న్‌గా నిలిచాడు సెర్బియ‌న్ స్టార్ నొవాక్ జొకోవిచ్‌. ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్లో మెద్వెదెవ్‌పై 7-5, 6-2, 6-2 తేడాతో వ‌రుస సెట్ల‌లో గెలిచాడు. నొవాక్‌కు ఇది 9వ ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ టైటిల్ కావ‌డం విశేషం. గ‌తంలో మ‌రే ప్లేయ‌ర్ ఇన్నిసార్లు ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ టైటిల్ నెగ్గ‌లేదు. అత‌ని కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ 18 గ్రాండ్‌స్లామ్ టోర్నీల‌ను సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ ఫైన‌ల్‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ జొకోవిచ్‌కు ఓట‌మి ఎర‌గ‌ని రికార్డు ఉండ‌టం విశేషం. ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్లోనూ జొకోవిచ్ పూర్తి ఆధిపత్యం క‌న‌బ‌రిచాడు. తొలి సెట్‌లోనే మెద్వెదెవ్ నుంచి కాస్త పోటీ ఎదురైనా.. త‌ర్వాతి రెండు సెట్ల‌ను నొవాక్ సునాయాసంగా గెలిచాడు. 

VIDEOS

logo