మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Sports - Aug 04, 2020 , 00:30:39

మాటివ్వలేదు: ఇర్ఫాన్‌ పఠాన్‌

మాటివ్వలేదు: ఇర్ఫాన్‌ పఠాన్‌

న్యూఢిల్లీ: లంక ప్రీమియర్‌ లీగ్‌ (ఎల్‌పీఎల్‌)లో పాల్గొంటున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని భారత మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ వెల్లడించాడు. ఫ్రాంచైజీ లీగ్‌లో ఆడాలనుకుంటున్న మాట వాస్తవమే కానీ, ప్రస్తుతం ఏ లీగ్‌లోనూ పాల్గొనడం లేదని సోమవారం స్పష్టం చేశాడు. ‘ఇర్ఫాన్‌ సహా 70 మంది విదేశీ ఆటగాళ్లు ఎల్‌పీఎల్‌లో ఆడేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఐదు ఫ్రాంచైజీలు అతడిని మార్క్యూ ప్లేయర్‌గా ఎంపిక చేసుకున్నాయి’ అని ఇటీవల ఎల్‌పీఎల్‌ నిర్వాహకులు ప్రకటించిన నేపథ్యంలో సోమవారం ఇర్ఫాన్‌ స్పందించాడు. ‘భవిష్యత్తులో లీగ్‌ల్లో ఆడే ఆలోచన ఉంది. కానీ, ఇప్పుడు మాత్రం నేను అందుబాటులో ఉంటానని ఎవరికీ మాటివ్వలేదు’ అని పఠాన్‌ ట్వీట్‌ చేశాడు. 


logo