బుధవారం 12 ఆగస్టు 2020
Sports - Jul 05, 2020 , 02:44:49

ఒలింపిక్స్‌కు అర్హత సాధించకపోవడంతో..

  ఒలింపిక్స్‌కు అర్హత సాధించకపోవడంతో..

బ్యాటింగ్‌, బౌలింగ్‌ ద్వారా కాకుండా.. తన ఫీల్డింగ్‌తోనే ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న దక్షిణాఫ్రికా సూపర్‌మ్యాన్‌ జాంటీ రోడ్స్‌కు హాకీలోనూ మంచి ప్రావీణ్యం ఉంది. చురుకైన కదలికలతో అసాధ్యమనుకునే క్యాచ్‌లను సైతం ఒంటిచేత్తో ఒడిసిపట్టిన జాంటీ దక్షిణాఫ్రికా జాతీయ జట్టు తరఫున హాకీ ఆడాడు. రోడ్స్‌ సభ్యుడిగా ఉన్న సఫారీ హాకీ జట్టు 1992 ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయింది. ఆ తర్వాత 1996 ఒలింపిక్‌ జట్టు ఎంపిక సమయంలో మరోసారి పిలుపు వచ్చినా అప్పటికే క్రికెట్‌లో నిలదొక్కుకోవడంతో పాటు గాయం కారణంగా జాంటీ హాకీకి దూరమయ్యాడు.

తాజావార్తలు


logo