మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Sports - Sep 02, 2020 , 00:54:14

షికార్ల కోసం కాదు: కోహ్లీ

షికార్ల కోసం కాదు: కోహ్లీ

దుబాయ్‌: యూఏఈలో అడుగుపెట్టింది క్రికెట్‌ ఆడేందుకే తప్ప.. షికార్ల కోసం కాదని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అన్నాడు. బయో సెక్యూర్‌ వాతావరణంలో ఈ నెల 19 నుంచి ప్రారంభం  కానున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 13వ సీజన్‌ కోసం 8 జట్లు ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. క్వారంటైన్‌ ముగించుకున్న ఆటగాళ్లు నెట్స్‌లో చెమటోడుస్తున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లీ మంగళవారం మాట్లాడుతూ.. ‘మనమంతా ఇక్కడికి వచ్చింది క్రికెట్‌ ఆడేందుకు. లీగ్‌ సజావుగా సాగాలంటే బయో సెక్యూర్‌ వాతావరణాన్ని కాపాడాలి. జల్సా చేసేందుకు ఇది తగిన సమయం కాదు. పరిస్థితులను ఆకలింపు చేసుకొని అందుకు తగ్గట్లుగా మసులుకోవాలి. వైరస్‌ వ్యాప్తితో రెండు నెలల క్రితం అసలు ఐపీఎల్‌ జరుగుతుందని కూడా ఊహించలేదు. అలాంటిది ప్రాక్టీస్‌ మొదలు పెట్టేవరకు వచ్చాం’ అని అన్నాడు. 


logo