ఆదివారం 07 మార్చి 2021
Sports - Jan 21, 2021 , 11:57:01

ధోనీలాంటి లెజెండ్‌తో న‌న్ను పోల్చొద్దు: రిష‌బ్ పంత్

ధోనీలాంటి లెజెండ్‌తో న‌న్ను పోల్చొద్దు: రిష‌బ్ పంత్

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జ‌రిగిన టెస్ట్ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన రిష‌బ్ పంత్‌ను ధోనీతో పోలుస్తున్నారు. అందులోనూ బ్రిస్బేన్ టెస్ట్‌లో ధోనీ రికార్డును కూడా తిర‌గ‌రాయ‌డంతో ఈ పోలిక మ‌రింత ఎక్కువైంది. అయితే పంత్ మాత్రం త‌న‌ను ధోనీతో పోల్చొద్ద‌ని అంటున్నాడు. ఆస్ట్రేలియా టూర్ ముగించుకొని గురువారం ఢిల్లీలో అడుగుపెట్టిన పంత్ మీడియాతో మాట్లాడాడు. ఈ సంద‌ర్భంగా త‌న‌ను ధోనీతో పోల్చొద్ద‌ని అత‌ను కోరాడు.  ఎమ్మెస్ ధోనీలాంటి ప్లేయ‌ర్‌తో పోలుస్తుంటే చాలా బాగుంటుంది. కానీ న‌న్ను ఎవ‌రితోనూ పోల్చ‌డం నాకు ఇష్టం ఉండ‌దు. ఇండియ‌న్ క్రికెట్‌లో నాకంటూ ప్ర‌త్యేకంగా పేరు సంపాదించుకోవాల‌ని అనుకుంటున్నాను. ప్ర‌స్తుతం నా దృష్టంతా దానిపైనే. ఓ లెజెండ‌రీ ప్లేయ‌ర్‌తో ఓ యువ‌కుడిని పోల్చ‌డం స‌రికాదు అని పంత్ స్ప‌ష్టం చేశాడు. టెస్టుల్లో కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్ (13) సాధించ‌డంపై స్పందిస్తూ.. చాలా బాగా అనిపిస్తోంది. కానీ ర్యాంకింగ్ గురించి నాకు తెలియ‌దు. ఇండియాను గెలిపించ‌డ‌మే నా ప‌ని అని పంత్ అన్నాడు. 

VIDEOS

logo