శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Feb 04, 2020 , 04:10:04

సెమీస్‌లో పుణె ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌

సెమీస్‌లో పుణె ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: భారత యువ షట్లర్‌ రితుపర్ణదాస్‌ అద్వితీయ ప్రదర్శన కనబర్చడంతో ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌)లో పుణె సెవెన్‌ ఏసెస్‌ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇప్పటికే చెన్నై సూపర్‌ స్టార్స్‌, నార్త్‌ ఈస్ట్రన్‌ వారియర్స్‌ సెమీస్‌ చేరగా.. పుణె మూడో జట్టుగా నిలిచింది. జీఎంసీ బాలయోగి స్టేడియంలో సోమవారం జరిగిన పోరులో పుణె 4-1తో అవధె వారియర్స్‌ను చిత్తుచేసింది. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ 14వ ర్యాంకర్‌ బివేన్‌ జాంగ్‌ను మట్టికరిపించిన రితుపర్ణ దాస్‌ పుణెకు చక్కటి విజయాన్నందించింది. మొదట జరిగిన పురుషుల డబుల్స్‌లో ఓటమి పాలైన పుణె.. వెనుకంజ వేసినట్లే కనిపించినా.. అవధె ట్రంప్‌ మ్యాచ్‌గా ఎంచుకున్న మహిళల సింగిల్స్‌లో రితుపర్ణ అదరగొట్టింది. 15-13, 15-12తో వరుస గేమ్‌ల్లో అగ్రశ్రేణి క్రీడాకారిణి జాంగ్‌ను ఓడించింది. ఆ తర్వాత మిక్స్‌డ్‌ డబుల్స్‌లో క్రిస్‌-గాబ్రియల్‌ జోడీ గెలుపొందగా.. పుణె ట్రంప్‌ మ్యాచ్‌లో కీన్‌ యే లో 15-12, 15-14తో శుభంకర్‌ డేను ఓడించడంతో పుణే గెలుపు ఖాయమైంది. అనంతరం అజయ్‌ జయరామ్‌ విజయం సాధించినా అవధెకు ఎలాంటి అవకాశం లేకుండా పోయింది.
logo