మంగళవారం 26 మే 2020
Sports - May 23, 2020 , 22:16:40

హాగ్‌ టెస్టు ఎలెవెన్‌లో కోహ్లీకి నో ప్లేస్‌

హాగ్‌ టెస్టు ఎలెవెన్‌లో కోహ్లీకి నో ప్లేస్‌

మెల్‌బోర్న్‌: తన ప్రస్తుత అత్యుత్తమ టెస్టు ఎలెవెన్‌ను ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌ హాగ్‌ ఫేస్‌బుక్‌లో శనివారం ప్రకటించాడు. అయితే ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా ప్రశంసలు పొందుతున్న టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి ఈ ఎలెవెన్‌లో హాగ్‌ చోటివ్వలేదు. నలుగురు భారత ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాడు. ఓపెనర్లుగా రోహిత్‌ శర్మ, మయాంక్‌ అగర్వార్‌ను తన ఎలెవన్‌లోకి తీసుకున్న హాగ్‌.. రహానేను మిడిల్‌ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా, పేసర్‌గా మహమ్మద్‌ షమీని భారత్‌ నుంచి ఎంపిక చేసుకున్నాడు. కోహ్లీకి చోటివ్వకపోవడంపైనా ఫేస్‌బుక్‌లో హాగ్‌ స్పందించాడు. చివరి 15టెస్టు ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ 31పరుగులను నాలుగుసార్లు మాత్రమే దాటాడని, అందుకే అతడిని ఈ ఏడాది తన జట్టులో అతడికి చోటివ్వలేదని వెల్లడించాడు. కాగా ఈ బెస్ట్‌ ఎలెవెన్‌కు కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా స్టార్‌ ప్లేయర్‌ క్వింటన్‌ డికాక్‌ను హాగ్‌ ఎంపిక చేశాడు.

బ్రాడ్‌ హాగ్‌ టెస్టు ఎలెవెన్‌:

మయాంక్‌ అగర్వాల్‌, రోహిత్‌ శర్మ, మార్నస్‌ లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్‌, బాబర్‌ ఆజం, అజింక్య రహానే, క్వింటన్‌ డికాక్‌(కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), పాట్‌ కమిన్స్‌, మహమ్మద్‌ షమీ, నీల్‌ వాగ్నర్‌, లాథన్‌ లయాన్‌ 


 


logo