శుక్రవారం 03 జూలై 2020
Sports - Apr 25, 2020 , 08:54:15

క‌రోనా ఎఫెక్ట్‌.. బాల్‌ ట్యాంప‌రింగ్‌కు చాన్స్!

క‌రోనా ఎఫెక్ట్‌.. బాల్‌ ట్యాంప‌రింగ్‌కు చాన్స్!

దుబాయ్‌:  బాల్ ట్యాంప‌రింగ్ విష‌యంలో అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి (ఐసీసీ) నిబంధ‌న‌లు స‌డ‌లించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. సంప్ర‌దాయ క్రికెట్‌లో బంతి మెరుపు పోగ‌ట్టి రివ‌ర్స్ స్వింగ్ రాబ‌ట్టేందుకు వాడే ఈ ప్ర‌క్రియ‌ కార‌ణంగా చాలామంది ఆట‌గాళ్లు త‌మ ప‌ర‌ప‌తి పోగొట్టుకుంటున్నారు. రెండేండ్ల క్రితం బాల్ ట్యాంప‌రింగ్ ఉదంతంతో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌, డేవిడ్ వార్న‌ర్ ఏడాది నిషేధం ఎదుర్కొన్న విష‌యం తెలిసిందే. అంత‌కుముందు కూడా చాలా మంది ఆట‌గాళ్లు ట్యాంప‌రింగ్‌కు పాల్ప‌డిన‌ట్లు రుజువైంది. 

ఉద్దేశ‌పూర్వ‌కంగా బంతి ఆకారాన్ని దెబ్బ తీయ‌డాన్ని నేరంగా ప‌రిగ‌ణిస్తున్న ఐసీసీ.. బాల్ ట్యాంప‌రింగ్‌ను చ‌ట్టబ‌ద్ధం చేయాల‌నే ప్ర‌తిపాద‌నను ప‌రిశీలిస్తున్న‌ది. అంపైర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో బంతిని పాలిష్ చేసేందుకు అనుమ‌తిలిచ్చే యోచ‌న‌లో ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు నిబంధ‌న‌ల‌కు లోబ‌డి బంతి మెరుపు పోగొట్టేందుకు ప్లేయ‌ర్లు ఉమ్ము (స‌లైవా) వాడుతున్నారు. అయితే క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు బంతిపై ఉమ్మి రుద్దాలంటే ఆట‌గాళ్లు భ‌య‌ప‌డే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. దీంతో ఐసీసీ మెడిక‌ల్ క‌మిటీ సూచ‌న‌ల మేర‌కు పాలిషింగ్‌కు చాన్స్ ఇవ్వొచ్చ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 


logo