బుధవారం 25 నవంబర్ 2020
Sports - Oct 28, 2020 , 19:10:06

MI vs RCB: టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న పొలార్డ్‌

MI vs RCB: టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న పొలార్డ్‌

అబుదాబి: ఐపీఎల్‌-13లో ఇవాళ రసవత్తర పోరు జరగనుంది.  పాయింట్ల పట్టికలో టాప్‌-2లో ఉన్న ముంబై ఇండియన్స్‌, రాయల్‌  ఛాలెంజర్స్‌ బెంగళూరు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ప్లేఆఫ్‌ బెర్తు ఖాయం చేసుకోనుంది. టాస్‌ గెలిచిన ముంబై తాత్కాలిక కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. తొడకండరాల గాయంతో రోహిత్‌ శర్మ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు.

బెంగళూరు జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయి. నవదీప్‌ సైనీ స్థానంలో శివమ్‌ దూబే, అరోన్‌ ఫించ్‌ స్థానంలో జోష్‌ ఫిలిఫ్‌, మొయిన్‌ అలీ స్థానంలో డేల్‌ స్టెయిన్‌లను జట్టులోకి తీసుకున్నట్లు బెంగళూరు సారథి కోహ్లీ వివరించాడు.