శుక్రవారం 03 జూలై 2020
Sports - May 14, 2020 , 17:24:56

పేస‌ర్లకు ప్రాధాన్య‌త ఇవ్వ‌డంలో కోహ్లీ భేష్‌: మ‌ద‌న్‌లాల్‌

పేస‌ర్లకు ప్రాధాన్య‌త ఇవ్వ‌డంలో కోహ్లీ భేష్‌: మ‌ద‌న్‌లాల్‌

న్యూఢిల్లీ:  భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో పేస్ బౌల‌ర్ల‌ను ప్రోత్స‌హించ‌డంలో ప్ర‌స్తుత టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ త‌ర్వాతే మ‌రెవ‌రైనా అని మాజీ క్రికెట‌ర్ మ‌ద‌న్‌లాల్ అభిప్రాయ‌ప‌డ్డాడు. జ‌ట్టు సామ‌ర్థ్యం, దూకుడు విష‌యంలో కోహ్లీకి ఉన్నంత జ్ఞానం మ‌రెవ‌రికీ ఉండ‌ద‌ని అన్నాడు. విరాట్ కార‌ణంగా భార‌త పేస్ దుర్భేద్యంగా త‌యారైంద‌ని పేర్కొన్నాడు. పేస్ విలువేంటో కోహ్లీకి క‌చ్చితంగా తెలుసు కాబ‌ట్టే వాళ్ల‌కు లెక్క‌కు మిక్కిలి అవ‌కాశాలు ఇస్తూ ప్రోత్స‌హిస్తున్న‌డ‌ని అన్నాడు.

`భార‌త పేస్ ద‌ళాన్ని ప‌టిష్ట ప‌రిచేందుకు కోహ్లీ ఎంచుకున్న మార్గం ఆమోద‌యోగ్య‌మైన‌ది. పేసర్ల‌కు గ‌‌తంలో ఏ భార‌త కెప్టెన్ ఇవ్వ‌నంత ప్రాధాన్య‌త విరాట్ ఇస్తున్నాడు. అందువ‌ల్లే మెరుగైన ఫ‌లితాలు వ‌స్తున్నాయి. ఒక‌ప్పుడు సునీల్ గ‌వాస్క‌ర్ నేతృత్వంలో పేస‌ర్ల‌కు విరివిగా అవ‌కాశాలు ల‌భించేవి. మ‌ళ్లీ ఇన్నాళ్ల త‌ర్వాత కోహ్లీ సార‌థ్యంలో అలాంటి ప‌రిస్థితి ఉంది. ఇక మైదానంలో కోహ్లీ దూకుడు నాకెంతో ఇష్టం. చాలా మంది విరాట్ ప్ర‌వ‌ర్త‌న‌తో అసంతృప్తి చెంద‌వ‌చ్చు కానీ నాకు మాత్రం ఎలాంటి త‌ప్పు క‌నిపించ‌డం లేదు. అలాంటి దూకుడు ఉండ‌బ‌ట్టే జ‌ట్టును ప‌రుగులు పెట్టించ‌గ‌లుగుతున్నాడు. గ‌తంలో ప్ర‌పంచ క్రికెట్‌లో భార‌తీయుల‌కు నెమ్మ‌ద‌స్తులు అనే పేరుండేది. ఇప్పుడు విరాట్ కార‌ణంగా భార‌త్ దూకుడు ప్ర‌పంచానికి తెలిసింది` అని మ‌ద‌న్‌లాల్ అన్నాడు.


logo