సోమవారం 25 మే 2020
Sports - Mar 30, 2020 , 11:41:43

ఐపీఎల్‌పై నిర్ణ‌యం తీసుకోలేదు..

 ఐపీఎల్‌పై నిర్ణ‌యం తీసుకోలేదు..

హైద‌రాబాద్‌: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ నిర్వ‌హ‌ణ‌పై ఎటువంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని బీసీసీఐ వ‌ర్గాలు చెబుతున్నాయి.  మ‌రికొన్ని రోజులు వేచి చూసిన‌ త‌ర్వాత‌నే ఐపీఎల్ నిర్వ‌హ‌ణ‌పై నిర్ణ‌యం ఉంటుంద‌ని బీసీసీఐ వ‌ర్గాలు ద్వారా వెల్ల‌డ‌వుతున్న‌ది.  వాస్త‌వానికి మార్చి 29వ తేదీన ఐపీఎల్ క్రికెట్ టోర్నీ ప్రారంభం కావాల్సి ఉన్న‌ది. కానీ క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో.. ఆ మెగా టోర్నీని వాయిదా వేశారు. తొలుత ఏప్రిల్ 15వ తేదీ వ‌ర‌కు ఐపీఎల్‌ను వాయిదా వేస్తూ నిర్ణ‌యించారు.  అయితే దేశంలో లాక్‌డౌన్ ఉన్న నేప‌థ్యంలో ఇప్పుడే ఎటువంటి నిర్ణ‌యాన్ని తీసుకోలేక‌పోతున్నారు.


 logo